సెలూన్లు, బ్యూటీపార్ల‌ర్‌లు రీఓపెన్ చేయాలంటూ నిర‌స‌న

సెలూన్లు, బ్యూటీపార్ల‌ర్‌లు రీఓపెన్ చేయాలంటూ నిర‌స‌న

రాంచీ: సెలూన్లు, బ్యూటీపార్ల‌ర్‌లు రీఓపెన్ చేయాలంటూ ఝార్ఖండ్‌లోని రాంచీలో సెలూన్ అసోసియేష‌న్ స‌భ్యులు రోడ్డుపై నిర‌స‌న చేప‌ట్టారు. దేశవ్యాప్తంగా బ్యూటీపార్ల‌ర్‌లు తెరిచార‌ని, త‌మ రాష్ట్రంలో కూడా సెలూన్లు ఓపెన్ చేసేందుకు అనుమ‌తివ్వాల‌ని కోరారు. క‌రోనా కార‌ణంగా త‌మ వ్యాపారాలు మూతపడ్డాయ‌ని.. దీంతో ‌కుటుంబ పోష‌ణ‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయని అన్నారు. క‌రోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఝార్ఖండ్ ప్ర‌భుత్వం ‌మహమ్మారిని కట్టడి చేసేందుకు గ‌తంలో జులై 31వతేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప‌లు ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు.