సంపద సృష్టించి అందరికీ సమానంగా పంచాలి

సంపద సృష్టించి అందరికీ సమానంగా పంచాలి

డిసెంబర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.సంపద సృష్టించి దాన్ని అందరికీ సమానంగా పంచాల్సిన అవసరం ఉందన్నారు.టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని..సమాజంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుని గొప్పగా ఎదగాలన్నారు. దళితబంధు పథకం కోసం రూ.17,700 కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టామన్నారు. చాలా మంది 10 లక్షల కోసం మాత్రమే చూస్తున్నారు. కానీ వాటితో ఎలా సంపద సృష్టించాలో ఆలోచించాలన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడినవారు దళితులు మాత్రమేనని..దళితసమాజం కూడా అభివృద్ధి వైపు అడుగులు వెయ్యాలని కోరారు.దళితుల అభివృద్ధి కోసం డిక్కీ సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని చెప్పారు.అమీర్ పేట్ లోని మారిగోల్డ్ హోటల్ లో రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలోఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్,డిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు.