ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదు : మంత్రి పువ్వాడ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదు : మంత్రి పువ్వాడ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మీడియా మాట్లాడిన ఆయన.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇవ్వలేదని అన్నారు. కార్మికుల సమ్మె దృష్ట్యా ప్రయాణికుల కోసం చేసిన  ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సక్సెస్ అయ్యామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్దమన్న పువ్వాడ..ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని విపక్షాలు సమర్ధిస్తాయా అని మండిపడ్డారు. సమ్మె పేరుతో విపక్షాలు రాజీయం చేయడం తగదని,  కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు..?  సమ్మెను ప్రయాణికుల మీద బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.