నా కామెంట్లకు కట్టుబడి ఉన్న

నా కామెంట్లకు కట్టుబడి ఉన్న
  • హిందూ ధర్మం కోసం ప్రాణాలిస్త
  •  నా కామెంట్లకు కట్టుబడి ఉన్న: రాజాసింగ్

హైదరాబాద్​, వెలుగు:  హిందూ ధర్మం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన గురువారం వీడియో విడుదల చేశారు. ఇది విడుదల చేసిన కొద్దిసేపటికే పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. ‘‘పోలీసులకు ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి సమాధానం చెబుతాను. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలుగుతుందంటే, దానికి కారణం ఎంఐఎం నేతలే. మునావర్ ఫారూఖీ ప్రోగ్రామ్ జరగడానికి, నేను వీడియో రిలీజ్ చేయటానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎంనే. నేను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తిని. నేను మహ్మద్ ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు” అని రాజాసింగ్ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇతరులు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.