జనవరిలో బావామరదళ్ల పెళ్లి .. ఇంతలోనే ఘోరం

జనవరిలో బావామరదళ్ల పెళ్లి .. ఇంతలోనే ఘోరం

చందానగర్, వెలుగు: ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొన్న ప్రమాదంలో బావమరదళ్లు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ లో ని చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుం ది. చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెం దిన పెం టయ్య, సూర్యకళ కుమారుడు మనోహర్(24). చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఆఫీస్ లో మనోహర్ చెత ్తట్రాలీ ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు. చందానగర్ లో ని శాం తినగర్ కు చెందిన లక్ష్మమ్మ, బిక్షపతి కుమార్తె సోని(17). మనోహర్, మేనమామ కుమార్తె అయిన సోని కొద్ది రోజులుగా ప్రేమిం చుకుంటు న్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన ఇరు కుటుం బసభ్యులు రెండు నెలల క్రితం మనోహర్, సోనికి నిశ్చితార్థం చేశారు. జనవరిలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.

క్రిస్మస్ వేడుకలకు వెళ్తూ ….

మనోహర్, సోని ఇద్దరూ గుం టూరులో ఉండే తమ బంధువు ఇంట్లో క్రిస్మస్ వేడుకలకు వెళ్లేం దుకు మంగళవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వారు వెళ్లా ల్సిన ట్రైన్ మిస్ కావడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి గుం టూరు వెళ్దామనుకున్నారు. మధ్యాహ్నం మనోహర్, తల్లి సూర్యకళ, సోని సికిం ద్రాబాద్ వెళ్లేం దుకు చందానగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో మొదట సూర్యకళ రైల్వే ట్రాక్ దాటింది. ఆ తర్వాత మనోహర్, సోని దాటుతుండగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం లో చనిపోయిన మనోహర్ కుటుంబానికి పెద్దదిక్కు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లయ్యా యి. తండ్రి చనిపోవడం, సోదరుడికి మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ మనోహరే చూసుకుంటున్నాడు. కళ్ల ముం దే కొడుకు చనిపోవడంతో సూర్యకళ రోదనలు అందరినీ కదిలించి వేశాయి.