ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్

ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.  హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగారు.  నామినేషన్ టైమ్ లో మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కంగనా వెంట ఉన్నారు. మండి ప్రజల ప్రేమ వల్లే తాను ఇక్కడివరకు వచ్చానని నామినేషన్ అనంతరం కంగన వెల్లడించారు.  

సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నట్లే రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తానని కంగనా రనౌత్ ధీమా వ్యక్తం చేశారు.  మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.   దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు కంగన.  అయితే కొన్నేళ్ల క్రితం మండి ప్రాంతంలో ఇప్పటికీ భ్రూణహత్యలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు. 

కాగా  కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మండి లోక్ సభ స్థానం నుంచి కంగన పోటీ చేస్తు్ండటంతో ఆసక్తికరంగా మారింది.   దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఇక్కడినుంచి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు.   జూన్ 1న మండిలో పోలింగ్ జరగనుంది.