
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ అన్నారు. కారు పని అయిపోయిందని విమర్శించారు. జాకీ పెట్టిన లేపినా కారు లేచే ప్రసక్తే లేదని చెప్పారు. భవిష్యత్ అంత బీజేపీ దేనని ప్రజలంతా బీజేపీవైపే చూస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకే వస్తాయని తెలిపారు.
నాలుగు విడతల్లోనే బీజేపీ మెజారిటీ సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి పక్ష హోదా కూడా దక్కుతుందో లేదో చూడాలని కే. లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మండం లేదని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.