ఇవాళ (మార్చి 15) హెచ్సీఏ ట్రెజరర్ పోస్టుకు ఎన్నిక

ఇవాళ (మార్చి 15) హెచ్సీఏ ట్రెజరర్ పోస్టుకు ఎన్నిక

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ) కొత్త ట్రెజరర్ పోస్టుకు ఆదివారం ఎన్నిక జరగనుంది. ఈ పోస్టుకు  వి. ఆగం రావు, కె. అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌, సి బాబురావు, ఆర్‌‌‌‌‌‌‌‌. హరినారాయణ రావు పోటీపడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే పోలింగ్‌‌‌‌లో ఆయా క్లబ్ సెక్రటరీలు, మాజీ క్రికెటర్లు సహా మొత్తం175 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తామని ఎలక్టోరల్ ఆఫీసర్ వీసీ సంపత్ ప్రకటించారు. కాగా, సెక్రటరీకి ఎం. జీవన్ రెడ్డి ఒక్కరే బరిలో నిలవడంతో ఆ పోస్టు ఏకగ్రీవం అయింది.