- కాంగ్రెస్ నేత మోత రోహిత్
- ఖైరతాబాద్‌లో నిరసన ర్యాలీ
బషీర్‌బాగ్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సరెండర్ అయ్యారని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆరోపించారు. భారత్‌ను నియంత్రిస్తున్నానని ట్రంప్ప్రకటనలు చేస్తున్నా మోదీ నోరు మెదపకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధాని వైఖరికి నిరసనగా హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్విగ్రహం నుంచి అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా మోత రోహిత్ మాట్లాడుతూ.. భారత్, పాక్ యుద్ధం ఆపింది తానేనని ట్రంప్ ప్రకటన చేసినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 30 రోజుల్లో రష్యాతో ఆయిల్ కొనుగులు చేసుకునేందుకు భారత్‌కు అనుమతిస్తున్నానని ట్రంప్చెప్పడం ఆయనకు, మోదీకి మధ్య ఉన్న అంతర్గత ఒప్పందాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో సచిన్ సావంత్, మాజీ ఎంపీ వీహెచ్, ఫిరోజ్ ఖాన్, విజయ రెడ్డి పాల్గొన్నారు.
