ప్రధాని మోదీపై పిటిషన్‌... తిరస్కరించిన సుప్రీంకోర్టు

ప్రధాని మోదీపై పిటిషన్‌... తిరస్కరించిన సుప్రీంకోర్టు

ప్రధాని నరేంద్ర మోదీ  ఈ  ఎన్నికల్లో పోటీలో పాల్గొనకుండా అనర్హత ఓటు వేయాలంటూ దాఖలైన  పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు మే14వ తేదీ మంగళవారం నిరాకరించింది.  దేవుడు, మందిరాల పేరుతో  మోదీ ఓట్లు అడిగారని.. ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే విక్రమ్ నాథ్ , సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మొదట పిటిషనర్‌ ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించింది.  దీంతో పిటిషనర్ ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు.  మతం పేరుతో ఓట్లు వేయించుకోవడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమే అవుతుందంటూ మోదీపై చర్య తీసుకోవాలని ఫాతిమా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.