కూసుమంచి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూరిజం శాఖ నుంచి రూ.5 కోట్లతో బుధవారం పార్కు సుందరీకరణ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా టూరిజం శాఖ డీఈ రామకృష్ణ, ఏఈ నరేశ్ మాట్లాడుతూ 30 మందితో ప్రయాణించే బోట్లు, నలుగురు కాలితో తోక్కె బోట్లు ఏర్పాటు, ఫౌంటేన్లు, ఫుడ్ కోర్టు, పిల్లలు పార్కు, కాటేజీలు, రెస్టారెంట్, మరుగుదొడ్లు, సెక్యూరిటీ గది, టికెట్ కౌంటర్, చైల్డ్స్ ప్లే ఏరియా, పాత్ వేస్, జెట్టకి మరమ్మతులు, పార్కు ఏరియాలో గ్రీనరీ పనులు చేన్తున్నట్లు టూరిజం ఆఫీసర్లు తెలిపారు.
