హసన్ పర్తి, వెలుగు : చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అంతర్జాతీయ అథ్లెట్ క్రీడాకారిణి నందిని అగసర, ఎస్సార్ యూనివర్సిటీ చాన్సలర్ ఎ.వరదారెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా అనంతసాగర్ లోని ఎస్సార్ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 24వ వార్షిక క్రీడోత్సవాలు - 2026 ను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ అథ్లెట్ క్రీడాకారిణి నందిని అగసర మాట్లాడుతూ క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదల ఎంతో అవసరమన్నారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధేశించుకుని కష్టపడి శ్రమిస్తే విజయం సాధించడం సాధ్యమని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ దీపక్ కార్గ్ మహేశ్, రమణరావు, సుధాకర్ పాల్గొన్నారు.
