రైతుల సంక్షేమమే లక్ష్యం  : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

రైతుల సంక్షేమమే లక్ష్యం  : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపహాడ్, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్​ మండలం నకిరిపేట పరిధిలోని దోమలవాగు నుంచి దిగువనున్న పంటపొలాలకు బుధవారం ఆయన సాగునీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలవాగు నుంచి సాగునీరు విడుదలతో లక్ష్మీపురం, సంజీవరెడ్డిపాలెం, బూర్గంఫహాడ్, మొరంపల్లి బంజర, నకిరిపేట, గోపాలపురం, పోలవరం, కొమ్ము నకిరిపేట, వేపలగడ్డ గ్రామాల పరిధిలోని సుమారు 700 నుంచి 800 ఎకరాల భూములకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్ది, మాజీ సొసైటీ అధ్యక్షుడు పోతిరెడ్ది వెంకటేశ్వర రెడ్ది తదితరులు పాల్గొన్నారు.