ఎస్సీ స్టూడెంట్స్ ఖాతాల్లోకి స్కాలర్ షిప్ లు..83 వేల మందికి రూ. 374 కోట్లు జమ

 ఎస్సీ స్టూడెంట్స్ ఖాతాల్లోకి  స్కాలర్ షిప్ లు..83 వేల మందికి  రూ. 374 కోట్లు జమ

హైదరాబాద్, వెలుగు: పోస్ట్‌‌‌‌‌‌‌‌మెట్రిక్ స్కాలర్ షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు ట్యూషన్, మెయింటెన్స్ ఫీజులను ప్రభుత్వం రిలీజ్ చేసింది. తొలిసారి నేరుగా స్టూడెంట్స్​ ఖాతాల్లో జమ చేసినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో వెల్లడించారు. 

2024–25 విద్యాసంవత్స రానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఈ నిధులు జమ చేశాయి. రూ.374  కోట్లను రాష్ట్రంలోని వివిధ కాలేజీలకు చెందిన 83,239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.173 కోట్లు, కేంద్రం రూ. 201 కోట్లు రిలీజ్ చేశాయని తెలిపారు. విద్యార్థులు తమ మెయింటెనెన్స్ అమౌంట్ ను మినహాయించుకొని, ట్యూషన్ ఫీజును కాలేజీలకు చెల్లించాలన్నారు. స్కాలర్ షిప్  జమచేసిన విద్యార్థుల వివరాలు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల ఈ-పాస్ లాగిన్స్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.