ఆదిలాబాద్, వెలుగు: పోలీసులకు డ్యూటీతో పాటు మానసికోల్లాసం తప్పనిసరని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది రోజువారీ విధుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటారని, ఈక్రమంలో శారీరక వ్యాయామం, క్రీడలు, వినోదాత్మక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను అందిస్తాయని తెలిపారు.
అనంతరం ఎస్పీ సిబ్బందితో కలిసి స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడారు. అడిషనల్ ఎస్పీ బి సురేందర్ రావు, ఏఎస్పీ మౌనిక, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.
