విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలి..ఎంపీ మల్లు రవి డిమాండ్

 విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలి..ఎంపీ మల్లు రవి డిమాండ్

ఢిల్లీ, వెలుగు: పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కడం అంటే దేశ ప్రజల గొంతు నొక్కడమేనని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి మండిపడ్డారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మల్లురవి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తక్షణమే ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు