బీజేపీలో 27 మంది అధికార ప్రతినిధులు..సెల్స్ కు కన్వీనర్లు, కో కన్వీనర్ల నియామకం

బీజేపీలో 27 మంది అధికార ప్రతినిధులు..సెల్స్ కు కన్వీనర్లు, కో కన్వీనర్ల నియామకం
  • ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ తన అనుబంధ జంబో కమిటీలను నియమించింది. పార్టీ గళాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఏకంగా 27 మందిని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా, 13 మందిని మీడియా ప్యానలిస్టులుగా నియమించింది. దీంతో పాటు పార్టీ అనుబంధ 23 విభాగాలకు రాష్ట్ర కన్వీనర్లు, కో-కన్వీనర్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు వారి పేర్లను ప్రకటించారు.

రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 27 మందిని నియమించగా వారిలో ఏడుగురు పాతోళ్లు కాగా, మిగిలిన 20 మంది కొత్తేళ్లే. అధికార ప్రతినిధులుగా జె.సంగప్ప, రాణి రుద్రమ, పొరెడ్డి కిశోర్ రెడ్డి, దిలీప్ చారి, చౌహాన్ విఠల్, సునీత రెడ్డి, సోలంకి శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్, చీకోటి ప్రవీణ్, చెన్నమనేని వికాస్ రావు, సుధాకర్ గాండే, ఇంద్రసేనారెడ్డి, కప్పార ప్రసాద్ రావు తదితరులను నియమించారు. టీవీ చర్చల్లో పాల్గొనేందుకు మీడియా ప్యానలిస్టులుగా వై.రచనారెడ్డి, తుల ఆంజనేయులు, టీఆర్ శ్రీనివాస్ సహా 13 మందికి బాధ్యతలు అప్పగించారు. 

23 సెల్స్‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త టీమ్..

పార్టీ అనుబంధ విభాగాలైన 23 సెల్స్‌‌‌‌కు కన్వీనర్లను నియమించారు. లీగల్ సెల్ కన్వీనర్‌‌‌‌గా గోకుల్ రామారావు, ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్‌‌‌‌గా జి.వెంకట్ రెడ్డి, ప్రొఫెషనల్స్ సెల్‌‌‌‌కు అశోక్ బల్దా, మెడికల్ సెల్‌‌‌‌కు కొప్పుల రాజశేఖర్ రెడ్డి, ఫైనాన్షియల్ సెల్‌‌‌‌కు కె.హన్మాండ్లు, కల్చరల్ సెల్‌‌‌‌కు నాగపురి రాజమౌళి గౌడ్, వీవర్స్ సెల్‌‌‌‌కు కర్నాటి ధనంజయను నియమించారు.