లడ్డూలు కొన్న ప్రధాని మోడీ.. బహ్రెయిన్ లో పర్యటన

లడ్డూలు కొన్న ప్రధాని మోడీ.. బహ్రెయిన్ లో పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం మోడీ బహ్రెయిన్ లోని మనామా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. బహ్రెయిన్ లో 2 రోజులు పర్యటించనున్నారు ప్రధాని. మోడీతోపాటు… భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పర్యటనలో ఉన్నారు.

అంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబీలో పర్యటన ముగించుకున్నారు మోడీ. యువరాజు మొహమ్మద్ బిన్ జయేద్.. మోడీకి ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికారు. అంతకుముందు.. భారత్- అబుదాబి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే యూఏఈలో అత్యున్నత పౌర పురస్కారం .. ఆర్డర్ ఆఫ్ జయేద్ ను ప్రధాని మోడీకి అందజేశారు యువరాజు మహ్మద్ బిన్ జయేద్ అల్ నాహ్యన్.

ఈ అక్టోబర్ 2న మహాత్మగాంధీ 150 జయంతి సందర్భంగా మోడీ, జయేద్ కలిసి స్మారక స్టాంప్ విడుదల చేశారు.

లడ్డూలు కొన్న ప్రధాని

ఈ సందర్భంగా.. యూఏఈలో రూపే కార్డుతో స్వైప్ చేసి.. ఓ స్వీట్ షాప్ లో లడ్డూలు కొన్నారు ప్రధాని. బహ్రెయిన్ లో శ్రీనాథ్ జీ గుడికి వెళ్లినప్పుడు ప్రసాదంగా ఈ లడ్డూలను ఇస్తానని మోడీ చెప్పారు.