కదులుతున్న కారులోనే డెలివరీ అయ్యింది

కదులుతున్న కారులోనే డెలివరీ అయ్యింది

గర్భిణితో వున్న మహిళ నెలలు నిండిన తర్వాత ఏ సమయంలో కాన్పు అవుతుందో చెప్పడం కష్టమే. అందుకే కాన్పుకు వారం ముందుగానే ఆస్పత్రిలో చేర్చమని చెపుతుంటారు డాక్టర్లు. ఇందులో కొందరు అంతగా పట్టించుకోరు. పురిటి నొప్పులు రావడం..ఎక్కువ కావడంతో అలాంటి వారు ఇంట్లోనో …లేదంటే మార్గమధ్యంలోనే డెలివరీ అవుతారు. ఇలాంటి ఘటన అమెరికాలో జరిగింది.

నెవాడాకు చెందిన మైఖెల్ అడిసన్ భార్య రుదియా నపియర్‌కు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెను కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు తన ముగ్గురు పిల్లలతో బయలుదేరాడు.  భార్యను ముందు సీట్లో కుర్చోబెట్టిన మైఖెల్.. ఆమెకు ధైర్యం చెబుతూ కారు నడుపుతూ ఆస్పత్రికి వెళ్తున్నాడు. కారు వెనకాల కూర్చున్న ఇద్దరు కూతుర్లు ఆమె పడుతున్న కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోగా… కొడుకు మాత్రం ఆమె పడుతున్న ప్రవస వేదనను వీడియో తీశాడు.పెయిన్ ఎక్కువ కావడంతో…ఆస్పత్రికి చేరకుండానే నడుస్తున్న కారులోనే రుదియా బిడ్డను కనేసింది. కిందపడిపోకుండా తన చేతులతో బిడ్డను అదిమి పట్టుకుని బయటకు తీసి గుండెలపై పడుకోబెట్టుకుంది. బిడ్డ కళ్లు తెరిచి ఏడవగానే.. ఆమె కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. మైఖెల్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది.