కరోనా ఎఫెక్ట్‌: పెరోల్‌ గడువు ఎక్స్‌టెన్షన్‌

కరోనా ఎఫెక్ట్‌: పెరోల్‌ గడువు ఎక్స్‌టెన్షన్‌
  • 60 నుంచి 120కి పెంచుతూ
  • నిర్ణయించిన మధ్యప్రదేశ్‌ సర్కార్‌‌

భోపాల్: కరోనా కారణంగా జైళ్లలో క్రౌడ్‌ను తగ్గించేందుకు ఖైదీలకు ఇచ్చిన పెరోల్‌ను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 120 రోజులకు పెంచింది. ఇప్పటికే ఇంటరిమ్‌ బెయిల్‌ గడువును 45 నుంచి 90 రోజులకు పెంచుతూ ఆ రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఖైదీల దగ్గర నుంచి అప్లికేషన్లను తీసుకోవాలని ఆయా జైళ్ల సూపరింటెండెంట్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా జైళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆర్డర్‌‌ మేరకు కొంత మంది ఖైదీలను పెరోల్‌పై, మరికొంత మందిని ఇంటరిమ్‌ బెయిల్‌పై రిలీజ్‌ చేశారు. విచారణన ఎదుర్కొంటున్న, కేసుల్లో అనుమానితులుగా ఉన్న 6500 మందిని వదిలిపెట్టామని, దాదాపు 12వేల మంది ఖైదీలు ఇంటరిమ్‌ బెయిల్‌, పెరోల్‌పై ఉన్నారని అధికారులు మీడియాతో చెప్పారు.