కేసీఆర్  మిల్లర్ల తో కుమ్మకయ్యారు

కేసీఆర్  మిల్లర్ల తో కుమ్మకయ్యారు

దేశంలో, రాష్ట్రంలో 50 నుండి 60 శాతం జనాభా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్నాయని తెలిపారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తం కుమార్ రెడ్డి అయితే  ప్రధాని  మోడీ, సీఎం కేసీఆర్ లు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ని ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడిన ఆయన.. ఆగస్ట్ నెలలో 5కోట్ల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం ఒప్పందం జరిగిందని తెలిపారు. కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు టార్గెట్ పెట్టిందన్నారు. అంటే.. 60లక్షల టన్నుల వడ్లు సేకరించాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు కూడా సేకరించలేదన్నారు.

పంజాబ్ లో ఇప్పటికే కోటి 10లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందన్నారు  ఉత్తం. మన కంటే చిన్న రాష్ట్రాలు కూడా 40 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తున్నాయన్నారు. వరి రైతులు నష్ట పోడానికి కేసీఆరే కారణమన్నారు .మరో వైపు అకాల వర్షాలతో  అన్నదాతలు ఆగమయ్యారన్నారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు, అధికారులు మోసం చేశారని అన్నారు.  వానలకు తడిసిన వడ్లు మొలకలెత్తాయన్నారు. కేసీఆర్  మిల్లర్ల తో కుమ్మకయ్యారని ఆరోపించారు.రబీ పంటలపై ఆంక్షలు వద్దన్నారు.

పార్లమెంట్ సమావేశంలో వరి రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు ఉత్తం కుమార్ రెడ్డి. అన్ని విధాలుగా కేసీఆర్  తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో వరి కి క్వింటాల్ కి 500 బోనస్ ఇస్తోందని తెలిపారు. పంజాబ్ లో కోటి 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయ్యిందన్న ఉత్తం..ధనిక రాష్ట్రంలో ఎందుకు రైతులపై చిన్న చూపు అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పంట బీమా  ఇవ్వకుండా కేసీఆర్  మోసం చేస్తున్నారన్నారు.