మంచిర్యాల, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో నాలుగేండ్ల కింద ప్రారంభమైన ‘ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్మల్టీస్టేట్కో ఆపరేటివ్‌సొసైటీ’ సంక్షోభంలో కూరుకుపోయింది. గడువు ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేక రాష్ర్టంలోని పలు బ్రాంచీలను మూసివేశారు. కొవిడ్‌కారణంగా కొంతకాలం నుంచి ఆశించిన డిపాజిట్లు రాకపోవడం వల్లే లావాదేవీలు స్తంభించాయని సొసైటీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రెండు రాష్ర్టాల్లో వేలాది మంది మెంబర్లు తమ పైసలు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్మల్టీస్టేట్ కో ఆపరేటివ్‌సొసైటీ.. మినిస్ర్టీ ఆఫ్అగ్రికల్చర్అండ్ఫార్మర్స్ వెల్ఫేర్కింద సెంట్రల్కో ఆపరేటివ్సొసైటీస్ రిజిస్ర్టార్ద్వారా 2017లో రిజిస్ర్టేషన్ పొందింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో క్రమంగా బ్రాంచీలను విస్తరించుకుంటూ వచ్చింది. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 15 బ్రాంచీలను ఏర్పాటు చేసింది. రెండు రాష్ర్టాల్లో సుమారు రెండువేల మంది మార్కెటింగ్సూపర్వైజర్లను నియమించుకొని వారి ద్వారా అర్బన్, రూరల్ ఏరియాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. రూ.100 మెంబర్షిప్ ఫీజు, రూ.500 షేర్‌తో వేలాది మందిని మెంబర్లుగా చేర్చుకుంది.
అధిక వడ్డీ ఆశ చూపి..
‘ముద్రలో పొదుపు – మీ బంగారు భవితకు మలుపు’, ‘పెట్టుబడులపై అత్యధిక వడ్డీని పొందండి’ అంటూ అధిక వడ్డీ ఆశచూపింది. 8.33 శాతం వడ్డీతో డెయిలీవైజ్సేవింగ్స్స్కీం రూ.30 నుంచి రూ.500 వరకు, 9 నుంచి 10.5 శాతం వడ్డీతో జనరల్మంత్లీ సేవింగ్స్స్కీమ్స్ రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ప్రవేశపెట్టింది. రూ.లక్ష ఫిక్స్డ్డిపాజిట్లపై ఏడాదికి 9.6 శాతం, ఏడాదిపైన 12 శాతం వడ్డీ చెల్లిస్తామని పేర్కొంది. అలాగే రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే ఆరేండ్లకు డబుల్, పదేండ్లకు మళ్లా డబుల్చెల్లిస్తామని ఆశ చూపింది. సీనియర్సిటిజన్లకు మరో ఆకర్షణీయమైన స్కీంను ప్రకటించింది. ఇలా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రూ. 150 కోట్ల
నుంచి 200 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు తెలిసింది.
నమ్మకమే పెట్టుబడిగా బిజినెస్...
ముద్ర సొసైటీ లోకల్‌గా మార్కెటింగ్ సూపర్ వైజర్లను నియమించుకొని వారి ద్వారా నమ్మకమే పెట్టుబడిగా కోట్లలో డిపాజిట్లు సేకరించింది. పట్టణాల్లో చిరు వ్యాపారులను, గ్రామాల్లో రైతు కూలీలను, చిన్న వ్యాపారులను టార్గెట్‌గా పెట్టుకొని సేవింగ్స్, డిపాజిట్లు చేయించారు. గతేడాది వరకు బాగానే నడిచినప్పటికీ ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. గడువు ముగిసినప్పటికీ డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేయకపోవడం, బ్రాంచీలు క్లోజ్ చేయడంతో ఆందోళన నెలకొంది. ఇటీవల మంచిర్యాల జిల్లా హాజీపూర్ బ్రాంచి పరిధిలోని మెంబర్లు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో మూడు నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. లక్సెట్టిపేట, జన్నారం, భీమారం, ఐబీ తాండూర్, చెన్నూర్ తదితర బ్రాంచీలను సైతం క్లోజ్ చేశారు. దీంతో డిపాజిటర్లు ముద్ర ఆఫీసులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
డిపాజిట్లు రాకనా.. ఇంకేమైనా మోసమా?
కొవిడ్ కారణంగా కొంతకాలంగా ఆశించిన డిపాజిట్లు రావడం లేదని, దీంతో పలు బ్రాంచీల్లో లావాదేవీలు స్తంభించాయని ముద్ర సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా మార్కెటింగ్సూపర్వైజర్లకు, స్టాఫ్‌కు జీతాలు చెల్లించకపోవడంతో చాలామంది వేరే దారి చూసుకుంటున్నారు. పలువురు రీజినల్, జోనల్లెవల్మేనేజర్లు సైతం ఉద్యోగాలు వదులుకున్నారని సమాచారం. దీంతో సొసైటీ పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. నిజంగానే కొవిడ్ వల్ల కోలుకోలేని దెబ్బతగిలిందా? గతంలో చాలా సంస్థల్లో జరిగినట్టు ఇంకేమైనా ఆర్థికమోసం దాగి ఉందా? అన్నీ అనుమానాలే. సొసైటీ చీఫ్ ప్రమోటర్లపైన హైదరాబాద్‌లో ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలిసింది.

