V6 News

IPL 2026: ముంబైకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి మిచెల్ శాంటర్న్ ఔట్

IPL 2026: ముంబైకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి మిచెల్ శాంటర్న్ ఔట్

ముంబై: లీగ్‎లో వరుస ఓటములతో సతమతమవుతోన్న ముంబై ఇండియన్స్‎కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మిచెల్ శాంటర్న్ గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. శాంటర్న్ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ కేశవ్ మహరాజ్‎ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. 

‘‘గాయం కారణంగా ఐపీఎల్ 2026 నుంచి ముంబై స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్నర్ వైదొలిగాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ముంబై  జట్టులోకి తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ దగ్గర క్యాచ్ పట్టే క్రమంలో శాంట్నర్‌కు గాయపడ్డాడు’’ అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్‎లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‎లో దారుణంగా విఫలమవుతోంది. విజయంతో ఈ సీజన్‎ను ఘనంగా ఆరంభించిన ముంబై ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలై చతికిలపడింది. ఈ సీజన్‎లో ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ముంబై రెండింట్లో గెలిచి ఐదు మ్యాచుల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమవడం, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫామ్‎లో లేకపోవడం ముంబైకి ఇబ్బందికరంగా మారింది.