నల్గొండ: తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం..రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులదే : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నల్గొండ: తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం..రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులదే : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  •     ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షలో మంత్రుల దిశానిర్దేశం

నల్గొండ, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు ఎదురయ్యే ముప్పు ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. మంత్రి అడ్లూరి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అడ్లూరి మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్, వ్యవసాయ విషయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 

రైతులకు పంటల మార్పిడి, ఆరుతడి పంటల వైపు వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఇది వరకే వరి వేసుకున్న రైతులను ఆదుకోవాలన్నారు. మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల్లో నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరి సాగు చేయవద్దని కోరారు. 

దేవరకొండ నియోజకవర్గంలో తాగునీరు అందించేందుకు లింకేజీ ఏర్పాటు చేయాలని, ఉమ్మడి జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండితో పాటు, ఆయా నియోజకవర్గాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేస్తామన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 600 మీటర్లు పూర్తయిందని, 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. పెండింగ నిధులు విడుదల చేయాలని విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కోరారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. ఆరుతడి పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా, కోతుల దాడి వల్ల పంటలు దక్కడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. 

అనంతరం ‘తెలంగాణ జలసిరి’ వాల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మందుల సామేలు, జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, ఎంసీ కోటిరెడ్డి, స్పెషలాఫీసర్, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన సెక్రటరీ దాసరి హరిచందన, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, యాదాద్రి అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.