బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కొత్త రికార్డు

బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కొత్త రికార్డు

అథ్లెటిక్స్ లో భారత్ కు  తొలి ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో రికార్డు నెలకొల్పారు. ఫిన్లాండ్ లో జరిగిన ‘పావో నుర్మి గేమ్స్’లో ఈటె (జావెలిన్) ను 89.30 మీటర్ల దూరంలో విసిరి సరికొత్త జాతీయ రికార్డును సృష్టించారు. ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఫిన్లాండ్ అథ్లెట్ ఆలివర్ హెలాండర్ 89.83 మీటర్ల దూరం ఈటెను విసిరారు.  

ఇక  ఇంతకుముందు 2021 మార్చిలో పంజాబ్ లోని పాటియాలాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ నీరజ్ చోప్రా 88.07 మీటర్ల దూరంలో ఈటెను విసిరారు.  2021 ఆగస్టు 7న టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్ రౌండ్ లో ఆయన 87.58 మీటర్ల దూరంలో ఈటెను విసిరి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్ వ్యక్తిగత కేటగిరిలో బంగారు పతకాన్ని సాధించిన రెండో భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచారు.