జులై 26న నీట్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌

జులై 26న నీట్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెడీ అవుతున్న స్టూడెంట్లకు హెచ్ఆర్డీ మినిస్ట్రీ గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఐఐటీ–జేఈఈ పరీక్షలను జులై 18 నుంచి -23 వరకు, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ ను జులై 26 న నిర్వహించనున్నట్లు హెచ్ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ప్రకటించారు. ‘జేఈఈ మెయిన్స్ జులై 18  నుంచి 23 వరకు, జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు ఆగస్టులో జరుగుతాయి. జులై 26 న నీట్ పరీక్ష నిర్వహిస్తాం’ అని నిశాంక్  చెప్పారు. నీట్ కు 15 లక్షల మంది, జేఈఈ-మెయిన్స్‌‌‌‌‌‌‌‌ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారని వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 29 మెయిన్ సబ్జెక్టులకు మాత్రమే సీబీఎస్ఈ పరీక్షలు జరుపుతుందని చెప్పారు. లాక్ డౌన్ తర్వాత ఎగ్జామ్స్ నిర్వహిస్తామని సీబీఎస్ఈ గతంలోనే ప్రకటించింది. ఎగ్జామ్స్ కు 10 రోజుల ముందే వివరాలు అందిస్తామంది.