ఇన్‌‌ఫ్రారెడ్‌‌ లైట్‌‌నుంచి ఎనర్జీని జనరేట్‌‌ చేయొచ్చు

ఇన్‌‌ఫ్రారెడ్‌‌ లైట్‌‌నుంచి ఎనర్జీని జనరేట్‌‌ చేయొచ్చు

మనిషి మనుగడ సులువుగా ఉండటానికి రోజుకొక కొత్త ఇన్వెన్షన్‌‌ జరుగుతూనే ఉంటుంది. అలానే బెంగళూరు‌‌కు చెందిన రీసెర్చర్లు కూడా ఒక మెటీరియల్‌‌ కనిపెట్టారు. అది కంటికి కనిపించని ఇన్‌‌ఫ్రారెడ్‌‌ రేడియేషన్‌‌, లైట్‌‌ను ఎనర్జీగా మారుస్తుంది అంటున్నారు. ఆ మెటీరియల్‌‌ ఎలా పనిచేస్తుందంటే...  

దేశంలో యాభైశాతానికి పైగా థర్మల్‌‌ (బొగ్గు) ఎనర్జీనే (కరెంట్‌‌) వాడుతున్నారు. దాని తరువాత హైడ్రోఎలక్ట్రిక్‌‌ ఎనర్జీపైన ఆధారపడుతున్నారు. ఇప్పుడు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. రానున్న కాలాల్లో థర్మల్‌‌ ఎనర్జీ జనరేట్‌‌ చేయడం కష్టమయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. దానికి బదులుగా సోలార్ ఎనర్జీ, విండ్‌‌ ఎనర్జీలు కూడా ఉన్నాయి. ఇకనుంచి ఇన్‌‌ఫ్రారెడ్‌‌ లైట్‌‌నుంచి కూడా ఎనర్జీని జనరేట్‌‌ చేయొచ్చు.

బెంగళూరులోని జనహర్‌‌‌‌లాల్‌‌ నెహ్రూ సెంటర్‌‌‌‌ ఫర్‌‌‌‌ అడ్వాన్స్డ్​ సైంటిఫిక్‌‌ రీసెర్చర్స్‌‌ (జెఎన్‌‌సిఎఎస్‌‌ఆర్‌‌‌‌) కనిపెట్టిన ‘సింగిల్‌‌ క్రిస్టలైన్‌‌ స్కాండియం నైట్రైడ్‌‌’ (ఎస్‌‌సిఎన్‌‌) అనే మెటీరియల్‌‌.. ఇన్‌‌ఫ్రారెడ్‌‌ రేడియేషన్‌‌, లైట్‌‌లను ఎనర్జీగా మార్చి బ్యాటరీలో స్టోర్‌‌‌‌ చేస్తుంది. ‘పోలారిటన్‌‌ ఎక్సిటేషన్‌‌ అనే పద్ధతిలో ఇది పనిచేస్తుంది. ఇన్‌‌ఫ్రారెడ్‌‌ రేడియేషన్‌‌, లైట్‌‌లు సింగిల్‌‌ క్రిస్టలైన్‌‌ స్కాండియం నైట్రైడ్‌‌ మెటీరియల్‌‌ మీద పడగానే ‘ఫ్రీ ఎలక్ట్రాన్ ఆసిలేషన్‌‌’ జరుగుతుంది. దానిద్వారా కరెంట్‌‌ ప్రొడ్యూస్ అవుతుంది’ అని మెటీరియల్‌‌ తయారుచేసినవాళ్లలో ఒకరైన కె.సి. మౌర్య అన్నాడు. ఈ ఎనర్జీ స్టోర్‌‌‌‌చేసిన బ్యాటరీలతో ఇప్పటివరకు హార్వెస్టింగ్‌‌, ఆప్టికల్‌‌ కమ్యూనికేషన్​ డివైస్‌‌లకు వాడారు. ప్రోటోటైప్‌‌లో ఉన్న ఈ మెటీరియల్‌‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసి అన్ని వస్తువులకు వాడేలా అందుబాటులో తీసుకొస్తామంటున్నాడు మౌర్య.