గ్రేట్ హీరో : 25 ఏళ్లుగా చక్కెర తీసుకోలేదు..దమ్ము కొట్టలేదు..మందు ముట్టుకోలేదు

గ్రేట్ హీరో : 25 ఏళ్లుగా చక్కెర తీసుకోలేదు..దమ్ము కొట్టలేదు..మందు ముట్టుకోలేదు

బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం(John Abraham) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధూమ్ సినిమా చూసిన వాళ్లకి ఇతని గురించి బాగా తెలుస్తుంది. కండలు తిరిగిన బాడీతో హ్యాండ్సమ్ హాంక్ లా ఉంటాడు జాన్. ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాల్లో సూపర్ హిట్ సినిమాలతో పాటు..స్టర్డమ్ ను కూడా సంపాదించుకున్నాడు. 

అయితే తాజాగా జాన్ అబ్రహం పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారణం ఆయన 25 ఏళ్లుగా చక్కెర తీసుకోకపోవడం, దమ్ము కొట్టకపోవడం, మందు ముట్టుకపోవడం. ఈ విషయాన్ని ఆయన సహా నటుడు బ్రిటీష్-పాకిస్థానీ నటుడు అలీ ఖాన్(Alyy Khan) ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

బాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీపడుతూ ఇప్పటికీ తన స్టార్ స్టేటస్ ను కంటిన్యూ చేయడానికి కారణం..ఆయనకు క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉండడం అని అన్నారు. జాన్ సన్యాసిలా జీవిస్తాడని, సినిమా వ్యాపారంలో తన నిరంతర విజయానికి కూడా అదే రహస్యమని చెప్పాడు.  

జోయా అక్తర్ డైరక్ట్ చేసిన లక్ బై ఛాన్స్‌లో అలీ ఖాన్ సహాయక పాత్రను పోషించాడు. ఇందులో జాన్ అబ్రహం అతిధి పాత్రలో కనిపించాడు. అలాగే జాన్ నెక్స్ట్ ఫిలిం టెహ్రాన్‌లో కూడా అలీ ఖాన్ నటిస్తుండటంతో..జాన్‌ వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. అయితే జాన్ అబ్రహంతో షూటింగ్ లో పాల్గొన్న టైంలో వీరిద్దరి మధ్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారట. మీ బాడీ ఇంత స్ట్రాంగ్గా కంటిన్యూ చేయడానికి కారణం అడగగా..జాన్ అబ్రహం తనదైన శైలిలో స్పందించాడు. 

"ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకు నిద్ర లేస్తానని, దాదాపు మూడు దశాబ్దాలుగా తనకు ఇష్టమైన డెజర్ట్ కాజు కల్తీని కూడా రుచి చూడలేదని చెప్పాడు. “27 ఏళ్లయింది నా దగ్గర ఎరేటెడ్ డ్రింక్స్ లేవు. అలాగే చక్కెర ప్రపంచంలోనే అతి పెద్ద విషమని నమ్ముతాను అందుకే టేస్ట్ చేయలేదని..సిగరెట్ తాగడం కంటే కూడా" అని జాన్ తెలిపాడు.అసలు ఇంత స్టార్ స్టేటస్ ని పొందుతూ ఉన్న హీరో ఇలాంటి మంచి అలవాట్లు ఉండటం పట్ల ఆయన ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు.