వెలుగుమట్ల ఘటనపై నిజనిర్ధారణ కమిటీ: కవిత

వెలుగుమట్ల ఘటనపై నిజనిర్ధారణ కమిటీ: కవిత

ఖమ్మం జిల్లా  వెలుగు మట్ల ఘటనలో తమ పోరాటంతోనే  ప్రభుత్వం వెనక్కి తగ్గి పట్టాలు ఇస్తుందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎలాంటి నోటీసు లేకుండా 750 ఇళ్లు కూల్చడం దారుణమన్నారు. వెలుగుమట్ల ఘటనపై నిజనిర్ధారణ కమిటి ఏర్పాటు చేశామని చెప్పారు కవిత. ఈ కమిటికి ప్రభుత్వం సహకరించాలన్నారు. 

►ALSO READ | నాకు తప్పకుండా పదవి వస్తది..కష్టపడి పనిచేస్తుందెవరో అధిష్టానికి తెలుసు: రాజగోపాల్ రెడ్డి

మీడియాతో మాట్లాడిన కవిత..  ప్రజల పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి పట్టాలు ఇస్తామని చెప్పింది. 10 గ్రామాల్లో ఇళ్లు ఇస్తామని ప్రకటించినా అనేక మందికి అన్యాయం జరిగింది. విశారదన్‌ను అరెస్ట్ చేయడం పారదర్శకత లేకపోవడాన్ని సూచిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా పారదర్శకంగా వ్యవహరించాలి. నిజనిర్ధారణ కోసం జస్టిస్ చంద్రకుమార్‌ను సంప్రదించాం. జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఖమ్మం పర్యటనకు వెళ్తుంది. భూదాన భూముల్లో నివసిస్తున్న వారికి న్యాయం జరిగేలా పరిశీలిస్తుంది. మానవ హక్కుల దృష్టితో విచారణ జరుగుతుంది. అధికారులు, బాధితులు, వివిధ విభాగాల వారితో చర్చలు. కమిటీలో స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి.  బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. కమిటీ పర్యటనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి అని విజ్ఞప్తి చేశారు.