MI Tickets: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టికెట్ల అమ్మకం షెడ్యూల్ రిలీజ్

MI Tickets: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టికెట్ల అమ్మకం షెడ్యూల్ రిలీజ్

MI Tickets: మార్చి 28 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మొదటి దశలో సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాల షెడ్యూల్‌ను ముంబై ఇండియన్స్ ఈరోజు (మార్చి 17న) విడుదల చేసింది. బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ముంబై ఇండియన్స్ తొలి దశలో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో హోమ్ మ్యాచ్‌తో తమ జర్నీని స్టార్ట్ చేయనుంది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పై ఇతర వేదికల్లో మ్యాచ్‌లను ఆడనుంది. ఆ తర్వాత మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే కీలక మ్యాచ్ ని వాంఖెడే స్టేడియంలో ఆడనుంది.

ఈ మ్యాచులకి సంబంధించిన టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్‌లో BookMyShow వెబ్‌సైట్, యాప్ ద్వారా ఎం-టికెట్ల రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈసారి టికెట్ల విక్రయాన్ని నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గూగుల్ పే ఉపయోగించే వినియోగదారులకు మార్చి 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 21 మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్లు బుక్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. రెండో దశలో ఎంఐ గోల్డ్, సిల్వర్, జూనియర్ మెంబర్లకు మార్చి 21 మధ్యాహ్నం 3 గంటల నుంచి మార్చి 22 మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 

►ALSO READ | Team India T20 Captain: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్!

మూడో దశలో ఎంఐ బ్లూ మెంబర్లు, ముందుగా రిజిస్టర్ చేసుకున్న BookMyShow యూజర్లకు మార్చి 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మార్చి 23 సాయంత్రం 5 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. చివరి దశలో సాధారణ ప్రజలకు మార్చి 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ విక్రయం ప్రారంభమవుతుంది. మెంబర్‌షిప్ ద్వారా ముందస్తు బుకింగ్ సదుపాయం పొందాలంటే, మార్చి 19వ తేదీ రాత్రి 11:59 లోపు మెంబర్‌షిప్ తీసుకోవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. అభిమానులకు ప్రాధాన్యత కల్పించేందుకు ఈ విధంగా దశలవారీగా టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ క్యాంప్‌ను స్టార్ట్ చేసింది.