ఇక డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ కష్టమే?

ఇక డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ కష్టమే?
  • టెస్ట్‌‌‌‌ ట్రాక్‌‌‌‌పై సెన్సింగ్‌‌‌‌ కెమెరాలు
  • తడబడితే పరీక్ష ఫెయిలైనట్లే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ పొందడం ఇక అంత ఈజీయేం కాదు. బండి నడపడంలో అటు ఇటైతే టెస్ట్‌‌‌‌ ఫెయిలయ్యే చాన్స్‌‌‌‌ ఉంది. ఎందుకంటే వాహనదారుడి ప్రతి కదలికను పసిగట్టేలా సెన్సర్లతో లైసెన్స్‌‌‌‌ పరీక్ష నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ విధానం రాబోతోంది. డ్రైవింగ్‌‌‌‌ ట్రాక్‌‌‌‌పై 25 నుంచి 30 అడుగుల ఎత్తులో సెన్సర్‌‌‌‌ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. డ్రైవర్‌‌‌‌ ట్రాక్‌‌‌‌పైకి వచ్చినప్పటి నుంచి బయటకెళ్లే వరకు అన్ని కదలికలను ఈ కెమెరాలు బంధిస్తాయి. పరీక్ష టైంలో డ్రైవర్‌‌‌‌ బండి ఎలా నడిపాడు, వెహికల్‌‌‌‌ ఎన్ని సార్లు ఆగింది, డ్రైవింగ్‌‌‌‌లో లోపాలున్నాయా? లాంటివి ఈ విధానంతో ఈజీగా తెలుసుకోవచ్చు. సెన్సింగ్‌‌‌‌ కెమెరాల డేటా ఆధారంగా బండి నడిపిన విధానాన్ని బట్టి ఆటోమేటిక్‌‌‌‌గా మార్కులు పడతాయి.