Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్‌ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?

Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్‌ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?

'ఓర్రీ' అలియాస్ ఓర్హాన్ అవత్రామణి (Orhan Awatramani) రీసెంట్ టైంలో బాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తోన్న పేరు ఇది. ఈ పేరు వెనుక ఎంతో బిజినెస్ ఉంది. ఎంతో పాపులారిటీ ఉంది. అందుకే ఇతను సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఓర్రీ తరచుగా బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్, కరీనా, దీపికా పదుకునే, నైసా దేవగన్ మరియు సారా అలీ ఖాన్‌లతో సహా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి పార్టీలు మరియు మీటింగ్ లతో ఎంజాయ్ చేస్తుంటాడు. 

బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్‌లను పట్టుకుని..తనదైన స్టైల్ లో ఫొటోలకు పోజులిస్తు వైరల్ అవుతున్నాడు. అంతేకాదండోయ్ ఓర్రీతో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు సైతం కూడా ఆసక్తి చూపుతున్నారు. అరహాన్ అలియాస్ ఆర్రీ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు సోషల్ మీడియాలో లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఎందుకంటే అతను దిగే ఫొటోలు అన్నీ ఏదోక సెలబ్రిటీతోనో..స్టార్ కిడ్ తోనే ఫొటోలకు ఫోజిలిస్తూ కనబడటమే.ఇక స్టార్స్ పార్టీ ఉందంటే అక్కడ ఓర్రీ ఉండాల్సిందే..

హీరో, హీరోయిన్‌లతో ఫొటోలు దిగడం ఓరీకి ఏదో సరదా అని అనుకుంటే మాత్రం పొరపాటు.? అలా ఫొటోస్ దిగి లక్షలు సంపాదిస్తున్నాడట. రోజుకి ఇద్దరు సెలెబ్రిటీలతో రెండు ఫొటోలు దిగి రూ.50 లక్షలు సంపాదిస్తాడట. అంటే హీరో, హీరోయిన్‌లతో ఫొటో దిగినందుకు రూ.25‍ లక్షలు చొప్పున వసూల్ చేస్తున్నాడట. తనకి ఫోటో ఇవ్వాలని అనిపిస్తే మాత్రం ఫ్రీగానే ఇస్తాడట. ఇక ఎవరైనా టచ్ చేయమని అడిగితే..అందుకు రూ.20 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఓరీ మాట్లాడుతూ వెల్లడించాడు. 

ఓరీకి పని చేయడం అంటే అస్సలు ఇష్టముండదట. అందుకే ఈవెంట్స్‌‌కి హాజరవుతూ.. ఫొటోలకు పోజులిస్తూ ఆదాయం పెంచుకుంటున్నాడట. ఈ విషయం తెలిసిన వారు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వివాహ వేడుకలలో కూడా ఓరీ సందడి చేశాడు. ఇంక ఆర్రీ టాలెంట్స్ విషయానికి వస్తే.. సింగర్, సాంగ్ రైటర్, ఫ్యాషన్ డిజైనర్, క్రియేటివ్ డైరెక్టర్, స్టైలిస్ట్, ఎక్జిగ్యూటివ్ అసిస్టెంట్ ఇలా చాలానే చెప్తాడు.

రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఓర్రీ తన లైఫ్, చేసే పనులకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు. అలాగే తనపై వచ్చే ట్రోలింగ్ గురించి కూడా క్రేజీ కామెంట్స్ చేశాడు. ఓర్రీ ఫొటోస్ సోషల్ మీడియాలో కనబడగానే అసలు ఎవరితను? వీడితో ఫొటోలు దిగుతున్నారు ఏంటి? వీడికి అంత సీన్ ఉందా? అంటూ నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Orhan Awatramani (@orry)