ఒకప్పుడు ట్రక్ డ్రైవర్.. ఇప్పుడు బిలియనీర్

ఒకప్పుడు ట్రక్ డ్రైవర్.. ఇప్పుడు బిలియనీర్

అతనో హైస్కూల్ డ్రాపవుట్. ఆ తర్వాత ఆటో మెకానిక్ గా, ట్రక్కు డ్రైవర్ గా పని చేసిండు. కానీ ఇప్పుడదే పర్సన్ బిలియనీర్ అయ్యిండు. న్యూజిలాండ్ లోనే రిచెస్ట్ పర్సన్ గా రికార్డు సాధించిండు. న్యూజిలాండ్ కు చెందిన గ్రేమ్ హార్ట్ ప్రస్థానమిది. ఈయనో బిజినెస్ మెన్. ట్రక్కు డ్రైవర్ గా పని చేసిన తర్వాత ఒటాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు. అప్పుడే ఆయన బిజినెస్ మెలకువలు నేర్చుకున్నాడు. లెవర్జ్ డ్ బైఔట్ (పరపతి కొనుగోలు) ఆధారంగా ఎన్నో డీల్స్ చేశాడు. ఆక్లాండ్ లో ర్యాంక్ గ్రూప్ పేరుతో ఈక్విటీ సంస్థను (ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ) నెలకొల్పాడు. దీని ద్వారా ఎన్నో సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేశాడు. పోయిన వారం హార్ట్ ర్యాంక్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న రెనాల్డ్స్​కన్య్జూమర్ ప్రొడక్ట్స్​లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కు వచ్చింది. దీంతో హార్ట్ దశ తిరిగింది. షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడంతో కంపెనీ వాల్యూ 4.4 బిలియన్ డాలర్లకు చేరింది.

వరల్డ్ మోస్ట్ బిలియనీర్

హార్ట్ వరల్డ్ మోస్ట్ ప్రైవేట్ బిలియనీర్లలో ఒకరు. ఇతని బిజినెస్ లలో కన్జ్యూమర్ గూడ్స్, ప్యాకేజింగ్ పెద్దవి. మరోవైపు ఇతనికి ఇంకో అభిరుచి కూడా ఉంది. హార్ట్ విహార నౌకలను కొనుగోలు చేస్తుంటారు. ఆయన దగ్గరున్న 116 మీటర్ల నౌక విలువ 200 మిలియన్ డాలర్లు. దీనికి హెలిప్యాడ్ ఉండడంతో పాటు ముందు భాగంలో మరో చిన్న నౌక కూడా ఉంటుంది. అదే విధంగా హార్ట్ దగ్గర అంతకుముందు మరో విహార నౌకతో పాటు జలాంతర్గామి కూడా ఉండేది. “ ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. మీకు వీలైనంత పెద్దది కొనుగోలు చేయండి. మీకు వీలైనంత రుణం తీసుకోండి. ఆపై ఆస్తిని సంపాదించుకునేందుకు కష్టపడండి”అని చెప్పే హార్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ కు ఫర్​ఫెక్ట్ ఎగ్జాంపుల్.