కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు

కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు

ఢిల్లీ : కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమీషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల ప్రతి పంటకు 60 నుంచి 80వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. పంటనష్టం కారణంగా మంచిర్యాలకు చెందిన రాజేశ్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కమిషన్ దృష్టికి తెచ్చారు. సరైన అధ్యయనం చేయని కారణంగా కాళేశ్వరం ఎగువ ప్రాంతంలో 30వేల మంది రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దీనికి సంబంధించి వెలుగు దిన పత్రిక ప్రచురించిన కథనాన్ని ఎన్ హెచ్ఆర్సీకి అందజేశారు. ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.