నిర్భయ కేసు : జనవరి 7కు వాయిదా

నిర్భయ కేసు : జనవరి 7కు వాయిదా

నిర్భయ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు విచారణ జనవరి 7కు వాయిదా పడింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దోషుల డెత్ వారెంట్ పై ఇవాళ విచారణ జరగగా… జనవరి 7కు వాయిదా వేశారు జడ్జి. రేపట్నుంచి సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులున్నాయి. రెండు వారాల పాటు సెలవులుంటాయి.

మరణశిక్షపై దోషులు క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. దానిపై సుప్రీంలో విచారణ జరగాల్సి ఉంటుంది. అందుకే జనవరి 7కు వాయిదా వేసింది పటియాలా హౌస్ కోర్టు. మరోవైపు క్షమాభిక్ష కోసం దోషులకు తాజా నోటిస్ ఇవ్వాలని తిహార్ జైలు అధికారులకు సూచించింది పటియాలా హౌస్ కోర్టు. ఒక వారం గడువు ఉండేలా ఈ నోటీస్ ఇవ్వాలని సూచించింది. వారు క్షమాభిక్ష వేసుకోవడానికి వారం టైమ్ ఇచ్చింది.