నో డీల్స్.. అభినందన్ ను వెంటనే రిలీజ్ చేయండి: భారత్

నో డీల్స్.. అభినందన్ ను వెంటనే రిలీజ్ చేయండి: భారత్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ తో ఎటువంటి డీల్స్ ఉండవ్… తక్షణం ఐఏఎఫ్ పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ రిలీజ్ ను మాత్రమే భారత్ కోరుకుంటోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ కు భారత ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పైలట్ తో మాట్లాడేందుకు కాన్సులేట్ యాక్సిస్ కల్పించాలని పాక్ ను కోరడం లేదు. ముందుగా అభినందన్ భారత్ కు సురక్షితంగా పంపాలని చెప్పింది. పైలట్ ను అడ్డుపెట్టుకుని, భారత్ తో డీల్ మాట్లాడే చాన్స్ వచ్చిందనుకుంటే పొరబాటేనని, అటువంటిదేం జరగబోదని భారత ప్రభుత్వం తెలిపనట్లు సమాచారం అందుతోంది.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న నేరుగా పాక్ లోకి వెళ్లి జైషే ఉగ్ర స్థావరాలపై బాంబులతో అటాక్ చేసింది. భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేసి దాదాపు 300 మంది ముష్కరులను మట్టుబెట్టింది. దానికి ప్రతిగా పాక్ యుద్ధ విమానాలు భారత బలగాలు, ప్రజలపై దాడి చేసేందుకు యత్నించాయి. వాటిని ఐఏఎఫ్ యుద్ధ విమానాలు సమర్థంగా తిప్పికొట్టాయి. కానీ ఆ ప్రయత్నంలో మన యుద్ధ విమానం ఒకటి పాక్ లో కూలిపోయింది. దాని పైలట్ అభినందన్ ను పాక్ కస్టడీలోకి తీసుకుంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

అయితే ఉద్రిక్తతలు తగ్గుతాయంటే అభినందన్ ను అప్పగిస్తామని  పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ చెప్పారు.