V6 News

నిమ్స్‌‌‌‌లో ఎంహెచ్‌‌‌‌ఎం అడ్మిషన్లకు నోటిఫికేషన్

నిమ్స్‌‌‌‌లో ఎంహెచ్‌‌‌‌ఎం అడ్మిషన్లకు నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: మాస్టర్స్‌‌‌‌ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎంహెచ్‌‌‌‌ఎం) కోర్సులో అడ్మిషన్లకు నిజామ్స్‌‌‌‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌(నిమ్స్‌‌‌‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ లేదా ఇతర కోర్సు లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. వయసు 30 ఏండ్లకు మించి ఉండ కూడదు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ దరఖాస్తులకు ఆగస్టు 5వ తేదీ వరకు, ఆఫ్‌‌‌‌లైన్ దర ఖాస్తులకు 9వ తేదీ వరకు గడువు ఇచ్చారు. నిమ్స్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ (www.nims.edu.in)లో కోర్సు పూర్తి వివ రాలను పొందుపర్చారు.

ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేయాలనుకునేవారు నేరుగా నిమ్స్‌‌‌‌కు వచ్చి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో దరఖాస్తును సమర్పిం చాలని కోర్స్ అకడమిక్ ఇన్​చార్జ్ మార్త రమేశ్‌‌‌‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 20 సీట్లు ఉన్నా యన్నారు. అర్హులైన స్టూడెంట్స్‌‌‌‌కు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్​ కల్పిస్తామని నిమ్స్‌‌‌‌ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు.