V6 News

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కీలక పదవి.. జగిత్యాల సభలో ప్రకటించిన కేసీఆర్

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కీలక పదవి.. జగిత్యాల సభలో ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం (ఏప్రిల్ 20) జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఈ మేరకు కేసీఆర్ ప్రకటన చేశారు. కాగా, ఇటీవలకాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ కండువా కప్పి జీవన్ రెడ్డిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని అన్నారు. 

►ALSO READ | బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే హరీష్ రావు ఢిల్లీ పోయిండు: సీఎం రేవంత్

జీవన్ రెడ్డి గుండె ధైర్యంతో నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 45 ఏళ్లుగా జీవన్ రెడ్డితో తనకు స్నేహం ఉందని.. భిన్న రాజకీయ పార్టీల వల్లే వేర్వేరుగా పని చేశామని చెప్పారు. జీవన్ రెడ్డి ప్రజాజీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. జీవన్ రెడ్డికి జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని అన్నారు. 

అన్నదమ్ముల్లాగా పని చేద్దామని జీవన్ రెడ్డితో చెప్పానన్నారు. జీవన్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నానని.. ఆయన ఒక్క కరీంనగరే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పని చేయాలన్నారు. నూటికి నూరు శాతం తెలంగాణ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.