V6 News

బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే హరీష్ రావు ఢిల్లీ పోయిండు: సీఎం రేవంత్

బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే హరీష్ రావు ఢిల్లీ పోయిండు: సీఎం రేవంత్

హైదరాబాద్: హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల కేసులో అరెస్ట్ చేయకుండా బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే హరీష్ రావు ఢిల్లీ వెళ్లాడని ఆరోపించారు. మవారం (ఏప్రిల్ 20) సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడంతో పాటు దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై అసెంబ్లీలో చర్చించాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ విచారణ కోరాం. 8 నెలలైనా సీబీఐ ఇప్పటికీ కేసు ఫైల్ చేయలేదు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాటిచ్చారు. మరీ 8 నెలలైనా ఎందుకు కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయట్లేదు. కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ చేస్తుందేమోనన్న భయంతోనే హరీష్ రావు ఢిల్లీకి పరిగెత్తాడు.

►ALSO READ | బీఆర్ఎస్‎లో చేరిన జీవన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

ఈ కేసులో అరెస్ట్ చేయొద్దని కేంద్రాన్ని బతిమాలేందుకే వెళ్లిండు. బీజేపీతో కుమ్మక్కై ఎంత కాలం విచారణ జరగకుండా ఆపుకుంటారు. హరీష్ రావు పర్యటనను రహస్యంగా ఉంచడంలో ఆంతర్యమేంటి..? న్యాయనిపుణులతో చర్చలకు హరీష్ రావు వెళ్లారని బీఆర్ఎస్ చెబుతోంది. కేసులో వాదనలు పూర్తయ్యాక న్యాయనిపుణులతో ఏం చర్చిస్తారు..? ఆర్ఎస్ఎస్ నేతలతో పైరవీ చేసి హరీష్ రావు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఢిల్లీలో హరీష్ రావు ఎవరెవరని కలిశారో బయటపెట్టాలి’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 నెల రోజుల ముందు తమ మేడిగడ్డ టూర్ ఫిక్స్ అయ్యింది.. ఉన్నత స్థాయి అధికారులు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.. దీంతో తమ అవినీతి బయటపడుతుందని అతితెలివితో కేసీఆర్ కూడా ఇదే రోజు జగిత్యాలలో సభ పెట్టారని అన్నారు.