ఐపీఎల్ 19లో దుమ్మురేపుతోన్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని.. అతడు టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని పొగిడాడు. ‘‘వైభవ్ ఒక అద్భుతమైన ప్రతిభావంతుడు. అతడిని వర్ణించడానికి ఎన్ని విశేషణాలు వాడినా సరిపోవు. వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం చూస్తుంటే అతడు భవిష్యత్తుకు ఒక ఆశాకిరణమని భావిస్తున్నాను’’ అని అయ్యర్ ప్రశంసించాడు.
ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 236కు పైగా స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. తన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో బుమ్రా, హేజల్ వుడ్, భువనేశ్వర్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. బ్యాటర్లను గడగడలాడించే టీమిండియా పేస్ స్టార్ బుమ్రా బౌలింగ్‌లో ఎలాంటి తడబాటు, బెదురు లేకుండా ఒకే ఓవర్లలో రెండు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు ఈ 15 ఏళ్ల బుడ్డోడు.
►ALSO READ | GT vs MI:గుజరాత్ కోటలో ముంబై గర్జిస్తుందా?..అహ్మదాబాద్ పిచ్‌పై సిక్సర్ల వర్షం ఖాయమా?
ఇక, ఈ సీజన్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా శ్రేయర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 208 పరుగులు సాధించి పంజాబ్ విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. కెప్టెన్‌గా ఓటమన్నదే లేకుండా పంజాబ్‌ను అజేయంగా ముందుకు నడిపిస్తున్నాడు. సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచులకు ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో దూసుకుపోతుంది.

