హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిభట్ల దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో వెళ్తున్న బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న తండ్రికొడుకు మరణించగా.. భార్య, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
మృతులను వనస్థలిపురం సాహెబ్ నగర్‌కు చెందిన ప్రశాంత్ (40), శ్రీతన్ (12)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి తండ్రి కొడుకు మరణించడం, తల్లికూతుర్లు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ప్రశాంత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రశాంత్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

