ఖాళీ అయిన MLC స్థానాలకు త్వరలో నోటీఫికేషన్

ఖాళీ అయిన MLC స్థానాలకు త్వరలో నోటీఫికేషన్

రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే నోటీఫికేష న్ రానుంది. మార్చ్ 3 నాటికి 16 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో 7 ఎమ్మెల్యే కోటా, 5 స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయుల కోటా2, పట్టభద్రుల కోటా 1, గవర్నర్ కోటాలో 1  ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటాలో 5 గురి పదవీ కాలం ముగిసింది. మిగిలిన ఇద్దరిపై వేటు పడింది. మొత్తం 16  ఎమ్మెల్సీ సీట్లలో  ఎమ్మెల్యే కోటాలోని  సీట్ల కే ఎక్కువ డిమాండ్ ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కొక్క అభ్యర్థికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. టీఆర్ ఎస్ కు 90 మంది సభ్యుల బలం ఉంది. ఈ లెక్కన ఆపార్టీ 5 సీట్లు గెలుచుకునే అవకావం ఉంది. ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఏ ఎమ్మెల్యే  ఎవరికి ఓటు వేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయించనున్నారు. మొత్తం 16 ఎమ్మెల్సీ సీట్లలో ఎమ్మెల్యే కోటాలోని వాటికి ఎక్కువమంది పోటీ పడుతున్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేట్ కోటా, టీచర్స్ , పట్టభద్రుల కోటాలో టికెట్ వస్తే  భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసినా .. ఎన్నికల సమయంలో ఎవరికి ఓటు వేస్తారోనన్న టెన్షన్ తప్పదు. ఎమ్మెల్యే కోటా అయితే ఖర్చు తప్పుతుందని  భావిస్తున్నారు నేతలు.  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్  కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  నోటీఫికేష న్ రాగానే అభ్యర్థులందరినీ  ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.