జొకోను రిలీజ్‌ చేయండి

జొకోను రిలీజ్‌ చేయండి

మెల్‌‌‌‌బోర్న్‌‌: సెర్బియా టెన్నిస్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ వీసా రద్దు కేసులో ఆస్ట్రేలియా గవర్నమెంట్​పై గెలిచాడు. ఫెడరల్‌‌ కోర్టు అతన్ని డిటెన్షన్‌‌ నుంచి రిలీజ్‌‌ చేయాలని ఆర్డర్స్‌‌ ఇచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా గవర్నమెంట్‌‌ సెకండ్‌‌ టైమ్‌‌ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.  దాంతో,  వీసా రద్దు కేసులో జొకో గెలిచినా.. వ్యాక్సిన్‌‌ డ్రామా మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సోమవారం జొకో కేసును విచారించిన ఫెడరల్‌‌ సర్క్యూట్‌‌ కోర్టు జడ్జీ అంథోనీ కెల్లీ... జొకోను మెల్‌‌బోర్న్‌‌ క్వారంటైన్‌‌ సెంటర్‌‌ నుంచి 30 నిమిషాల్లో రిలీజ్‌‌ చేయడంతో పాటు ఆసీస్‌‌లో ఉండేలా వీసాను పునరుద్ధరించాలని ఆర్డర్‌‌ ఇచ్చారు. అయితే జొకో డిటెన్షన్‌‌ను పర్సనల్‌‌గా రద్దు చేసే చాన్స్‌‌ తనకు ఉందో లేదో ఇమ్మిగ్రేషన్‌‌ మినిస్టర్‌‌ పరిశీలిస్తున్నారని గవర్నమెంట్ లాయర్‌‌ క్రిస్టోఫర్‌‌ ట్రాన్‌‌ వాదించారు. దీంతో జొకోను రెండోసారి అదుపులోకి తీసుకుంటే మాత్రం ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో బరిలోకి దిగడం కష్టమేనని తెలుస్తోంది. ‘వ్యాక్సిన్‌‌ ఎగ్జెంప్షన్‌‌’కు సరైన ఆధారాలు చూపలేదనే కారణంతో జొకో వీసా రద్దు చేసి  డిటెన్షన్‌‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.