బంపర్ ఆఫర్: బగ్​ కనిపెడితే 5 లక్షల రివార్డ్

బంపర్ ఆఫర్: బగ్​ కనిపెడితే 5 లక్షల రివార్డ్

న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌‌ఫోన్‌‌ తయారి సంస్థ వన్ ప్లస్, తమ సిస్టమ్స్‌‌ ఎదుర్కొంటున్న త్రెట్స్‌‌ను గుర్తించి రిపోర్ట్ చేస్తే రూ. 4.9 లక్షల వరకు రివార్డును ఇస్తామని గురువారం ప్రకటించింది. దీనికోసం బగ్‌‌బౌంటీ ప్రోగ్రంను ప్రారంభించింది. సైబర్ త్రెట్స్‌‌ నుంచి యూజర్లను రక్షించేందుకు కంపెనీ ఇప్పటికే హ్యకర్‌‌‌‌ పవర్డ్ సెక్యురిటీ సిస్టమ్స్‌‌కు చెందిన హ్యకర్‌‌‌‌వన్‌‌తో జతకట్టింది. “వన్ ప్లస్ సిస్టమ్స్‌‌ సెక్యురిటీని ప్రభావితం చేసే ఇష్యూలను గుర్తించి, సరియైన చర్యలను తీసుకునేందుకు వన్‌‌ప్లస్ గ్లోబల్ సెక్యురిటీస్ రెస్పాన్స్ సెంటర్, సెక్యురిటీ ప్రోఫెషనల్స్‌‌తో కలిసి పనిచేయనుంది” అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

వన్‌‌ప్లస్‌‌ సెక్యురిటీకి సంబంధించిన ఇష్యూలను వెతికి, గుర్తించి ఈ బగ్ బౌంటీ ప్రోగ్రం ద్వారా రిపోర్టు చేయాలని కోరింది. “క్యాలిఫయింగ్ బగ్‌‌ రిపోర్స్ట్‌‌కు రూ. 3,500 నుంచి రూ. 4.9 లక్షల వరకు రివార్డు ఉంటుంది. త్రెట్‌‌ ప్రభావితం చేయగలిగే సామర్ధ్యం బట్టి రివార్డు ఉంటుంది”అని పేర్కొంది. పొటెన్సియల్ త్రెట్ ఏదైనా వన్‌‌ప్లస్ అధికారిక సైట్, వన్‌‌ప్లస్ కమ్యునికేషన్ ఫారమ్, వన్‌‌ప్లస్​ అప్లికేషన్‌‌ ద్వారా రిపోర్ట్ చేయవచ్చని సెక్యురిటీ రిసెర్చ్‌‌లకు తెలిపింది. ఈ రిపోర్టులను వన్‌‌ప్లస్ టెక్నికల్ ఎక్స్‌‌పర్ట్స్ తిరిగి పరిశీలిస్తారు . పబ్లిక్ వెర్షన్ ప్రోగ్రం 2020లో ప్రారంభమవుతుంది.