భారీ లాభాల్లో ఆన్ లైన్ పాఠాల కంపెనీ బైజూస్

భారీ లాభాల్లో ఆన్ లైన్ పాఠాల కంపెనీ బైజూస్
  • పేటీఎం తర్వాత రెండో మోస్ట్ వాల్యుడ్ స్టార్టప్‌
  •  ‘డెకాకార్న్‌‌’ క్లబ్‌లో చేరిక

ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ బైజూస్ వాల్యుయేషన్ 10.5 బిలియన్ డాలర్లకు (రూ.79,409 కోట్లకు) చేరింది. సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్, అనలిస్ట్ మేరీ మీకర్‌‌ బాండ్ క్యాపిటల్ తాజా పెట్టుబడితో ఈ వాల్యుయేషన్ పెరిగింది. కరోనా వైరస్‌‌తో ఎడ్‌‌టెక్ సెక్టార్ బాగా దూసుకెళ్తోంది. కన్జూమర్ల  ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది. జనవరిలో 8 బిలియన్‌ ‌డాలర్లుగా ఉన్న బైజూస్ వాల్యుయేషన్‌‌, తాజాగా 30 శాతం పెరిగింది. పేటీఎం తర్వాత రెండో మోస్టు వ్యాల్యూడ్ స్టార్టప్ గా బైజూస్ నిలుస్తోంది. ఈ పెట్టుబడులతో బైజూస్ ‘డె కాకార్న్’ స్టార్టప్ ల క్లబ్‌ల‌లోకి చేరింది. 10 బిలియన్ డాలర్ల పైన వాల్యుయేషన్ కలిగిన కంపెనీలను ‘డెకాకార్న్‌’లుగా పిలుస్తారు. బాండ్ క్యాపిటల్‌‌కు ఇండియాలో ఇదే తొలి పెట్టుబడి. కరోనా మహమ్మారితో క్యాపిటల్‌‌ను సేకరించుకోవడానికి స్టార్టప్ లు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నక్రమంలో, ఈ పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే టైగర్ గ్లోబల్ మేనేజ్‌‌మెంట్, జనరల్ అట్లాంటిక్‌ నుంచి 400 మిలియన్ డాలర్ల నిధులు సేకరించినట్టు బైజూస్ చెప్పింది. మరో 1 బిలియన్ డాలర్ల ఫండ్‌‌ను సేకరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్యాపిటల్ గ్లోబల్‌‌గా కంపెనీ విస్తరణకు, కొనుగోళ్లకు ఉపయోగపడనుంది. ‘బాండ్ క్యాపిటల్ లాంటి ఇన్వెస్టర్‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్ టెక్నాలజీకి గ్లోబల్‌‌గా ఆసక్తి పెరుగుతోంది. డిజిటల్ లెర్నింగ్‌‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కరోనా సంక్షోభం ఆన్‌‌లైర్నింగ్‌‌ను మరింత ముందుకు తెచ్చింది. పేరెంట్లకు,టీచర్లకు,స్టూడెంట్లకు సాయం చేస్తూ..దీని వాల్యును తెలుపుతోంది’ అని బైజూస్ ఫౌండర్, సీఈవో రవీంద్రన్ తెలిపారు. కరోనా కారణంతో దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు మూతపడిన క్రమంలో,బైజూస్ స్టూడెంట్లకు తన లెర్నింగ్ యాప్‌‌ను ఉచితంగా అందిస్తోంది. లైవ్ క్లాస్‌‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈఎడ్‌‌టెక్ స్టార్టప్ కు 57మిలియన్‌‌ల రిజిస్టర్ స్టూడెంట్లు, 3.5 మిలియన్‌‌లకు పైగా పెయిడ్ సబ్‌‌స్కయిబర్లు ఉన్నారు. యాన్యువల్ రెన్యువల్ రేటు 85 శాతంగాఉంది. డిస్నీతో పార్టనర్ షిప్ కుదుర్చుకుని చిన్న పిల్లలకు కూడా టీచ్ చేస్తోంది. అంతేకాక ఇండియన్ క్రికెట్ టీమ్‌‌కు లీడ్ స్పాన్సర్‌ ‌గా ఉంది.

రెండింతలు పెరిగిన రెవెన్యూలు..

బైజూన్ తన రెవెన్యూలను రెండింతలు పెంచుకుంది.2019లోరూ.1,430కోట్లుగా ఉన్న రెవెన్యూలు 2020లోరూ. 2,800కోట్లకు పెరిగాయి. 2007లోకామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)కు ప్రిపేరయ్యే వారికి ఆఫ్‌‌లైన్ కోచింగ్ క్లాసెస్‌ ‌కోసం రవీంద్రన్ బిజినెస్‌‌ను మొదలెట్టారు. ఆ తర్వాత 2011లో దీన్ని థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌‌గా రిజిస్టర్ చేశారు. 2015లోమొబైల్‌‌ యాప్ లాంచ్ చేసిన తర్వాతే బైజూస్‌ ‌కంపెనీ బాగా సక్సెస్ సాధించింది.అప్పటి నుంచి టాప్ టైర్ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2018లో 1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ నుంచి ఇప్పుడు 10.5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌‌కు చేరుకుంది.