సూర్యాపేట జిల్లాలో రూ.30 కోట్ల ధాన్యం మాయం

సూర్యాపేట జిల్లాలో రూ.30 కోట్ల ధాన్యం మాయం

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్  ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు యథేచ్ఛగా నొక్కేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రవికృష్ణ రైస్ ఇండస్ట్రీలో శుక్రవారం విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు  సోదాలు నిర్వహించగా, మిల్లులో ఉండాల్సిన నిల్వల కంటే ఏకంగా 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు తేలింది.

దీని విలువ మార్కెట్​లో సుమారు రూ. 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, జిల్లాలో కేవలం వారం వ్యవధిలోనే సుమారు రూ. 103 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించడం స్థానికంగా కలకలం రేపుతోంది.