తొర్రూరు, వెలుగు : ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

తొర్రూరు, వెలుగు :  ఘనంగా  ముత్యాలమ్మ బోనాలు

తొర్రూరు, వెలుగు :  బోనాల పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి బోనాల మహోత్సవాల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని అమ్మవారిని ప్రార్థించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, మహిళలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.