ఇలా అప్లయ్ చేస్తే రెండు రోజుల్లో PAN కార్డ్ తీసుకోవచ్చు

ఇలా అప్లయ్ చేస్తే రెండు రోజుల్లో PAN కార్డ్ తీసుకోవచ్చు

ప్రస్తుత కాలంలో బ్యాంకు లావాదేవీలకు పాన్ కార్టు తప్పనిసరైంది. కొత్తగా PAN కార్టు పొందాలంటే ఆన్ లైన్ లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. కార్డు రావాలంటే15 రోజులు పడుతుంది. అయితే NSDL వెబ్ సైట్ లో కార్డు కోసం అప్లయ్ చేసుకుంటే వెంటనే పొందే వీలుంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో రెండు రోజుల్లో PAN కార్డును పొందేందుకు అవకాశం ఉంది. ఫామ్ 49ఏ లేదా ఫామ్ 49ఏఏ దరఖాస్తు ద్వారా వెంటనే పాస్ పోర్టు పొందవచ్చు. ఇందుకు NSDL వెబ్ సైట్ www.tin-nsdl.com  ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలంటే.. NSDL టిన్-ఫెసిలిటేషన్ సెంటర్ (TIN-FC) లో ఫామ్ తీసుకుని అప్లయ్ చేసుకోవచ్చు.  NSDL వెబ్ సైట్ నుంచి కూడా ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫామ్ ఇలా నింపండి..
దరఖాస్తును నల్ల ఇంక్ తో పెద్ద అక్షరాలతో నింపండి. రెండు ఫొటోలు అతికించాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ కాపీ, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డు ను జతపరచాలి.