టెక్‌‌‌‌‌‌ స్టార్టప్స్‌‌‌‌లో పేటీఎం పెట్టుబడులు

టెక్‌‌‌‌‌‌ స్టార్టప్స్‌‌‌‌లో పేటీఎం పెట్టుబడులు

న్యూఢిల్లీ : డిజిటల్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌లో వచ్చే కొత్త టెక్‌‌‌‌ స్టార్టప్స్‌‌‌‌లో రూ. 500 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేటీఎం ప్రకటించింది. భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌, బిగ్‌‌‌‌ డేటా సొల్యూషన్స్‌‌‌‌లో కొత్త ఇన్నోవేషన్స్‌‌‌‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం రూ. 500 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు పేర్కొంది. డిజిటల్‌‌‌‌ రివల్యూషన్‌‌‌‌ ఫలాలు అందరికీ చేరవేయాలనేదే తమ లక్ష్యంగా తెలిపింది. స్టార్టప్స్‌‌‌‌తో భాగస్వాములై డిజిటల్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేటీఎం వెల్లడించింది. ఇండియాలో ఎంట్రప్రెనూర్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌ విస్తరిస్తోందని, ఇన్నోవేటివ్‌‌‌‌ స్టార్టప్స్‌‌‌‌ వస్తున్నాయని పేటీఎం డిప్యూటీ సీఎఫ్‌‌‌‌ఓ వికాస్‌‌‌‌ గర్గ్‌‌‌‌ చెప్పారు.