ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర

ఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర

పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. ఇవాళ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర 100 రూపాయల 21 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ రేటు 89 రూపాయల 53 పైసలుగా ఉంది. కోల్ కతాలోనూ లీటర్ పెట్రోల్ ధర వంద  దాటింది. కోల్ కతాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 23 పైసలుగా ఉండగా...డీజిల్ ధర 92 రూపాయల 50 పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 106 రూపాయల 25 పైసలుగా ఉండగా..డీజిల్ 97 రూపాయల 9 పైసలుగా ఉంది. చెన్నై లో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 6 పైసలు, డీజిల్ ధర 94 రూపాయల 6 పైసలుగా ఉంది. గత నెలలో 16 సార్లు పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ వంద దాటింది. లీటర్ పెట్రోల్ వంద దాటిన రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్ము కశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బిహార్, సిక్కిం, పంజాబ్, లడఖ్, బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి.